ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి మృతి

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డికి మృతి బాధాకరం : ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే

విజయవాడ, మార్చి 22:  ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్ట్ గా ఉన్న ఆయన ప్రెస్ అకాడమీ కి చైర్మన్ గా శ్రీనాథ్ రెడ్డి చేసిన సేవలు మరువ లేనివని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి ఏపీయూడబ్ల్యూజేకి తీరనిలోటని పేర్కొన్నారు. సంతాపం తెలియజేసిన వారిలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందుజనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, దాసరి నాగరాజు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఫోటో జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు ఎన్. సాంబశివరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్ తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest