ధర్మవరం
గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు. నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట చెరువులు ఆక్రమించి చేసిన కబ్జాలు చూపించాను. ఈ రోజు ఉదయం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా ఇది. జనాల్ని ఏమార్చేందుకు గుడ్ మార్నింగ్ డ్రామా, మూడు పూట్లా చేసేవి కబ్జాలు-దందాలు. డ్రామాలన్నీ బట్టబయలయ్యాయి. బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి.
నారా లోకేష్
(ధర్మవరం యువగళం పాదయాత్ర నుంచి)
యువగళం లోకేష్‌కి అపురూప బహుమతి
యువనేత లోకేష్‌పై ధర్మవరం నేతన్నలకి అంతులేని అభిమానం. యువగళంకి నేతన్నలు యువదళమై అండగా నిలిచారు. చేనేతలో నైపుణ్యాన్ని ప్రదర్శించి, లోకేష్ ప్రతిరూపాన్ని యువగళం పేరుని పట్టుతో నేసి వస్త్రరూపంలోకి తీసుకొచ్చారు. తొగట వీర క్షత్రియుడైన పుట్లూరు ప్రకాష్ అతని స్నేహితులు పట్టులో ఆత్మీయత కలనేసి ఇచ్చిన అపురూప బహుమతి లోకేష్ అందుకున్న ఆనంద క్షణాలివి.