మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టే?

అమరావతి:

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టే కనిపిస్తోంది. శాసన మండలి ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో- తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తోన్నట్టే.ఈ ఎన్నికల్లో గెలిచిన కొందరికి కేబినెట్ బెర్త్ కల్పించాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు ఇదివరకే అంచనాలు వ్యక్తం అయ్యాయి. ఆ అంచనాలన్నీ ఇక వాస్తవ రూపాన్ని దాల్చడం దాదాపుగా ఖాయమైనట్టే.

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో- వైఎస్ఆర్సీపీ నుంచి మర్రి రాజశేఖర్‌, బొమ్మి ఇజ్రాయిల్‌, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయమంగళ వెంకటరమణ విజయం సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన కోటాల్లో నర్తు రామారావు, వంకా రవీంద్ర, కావూరు శ్రీనివాస్, మధుసూదన్, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, ఎస్‌ మంగమ్మ, సిపాయి సుబ్రమణ్యం, మేరుగ మురళీధర్, కుడిపూడి సూర్యనారాయణ విజయం సాధించారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సాయంత్రం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- జగన్ తో స్పీకర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. అనేక ఊహాగానాలకు తెర తీసినట్టయింది.

తమ్మినేని సీతారాంను వైఎస్ జగన్ తన మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు కావడం వల్ల మంత్రిగా ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియోజకవర్గానికి తమ్మినేని ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. అయిదుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇందులో నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థిగా గెలిచారాయన. 2019 నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు.

శ్రీకాకుళం జిల్లాకే చెందిన డాక్టర్ సీదిరి అప్పల్రాజు స్థానంలో మంత్రివర్గంలో తమ్మినేని సీతారాంకు బెర్త్ దక్కుతుందని చెబుతున్నారు. ఇవ్వాళే సీదిరి అప్పల్రాజు కూడా జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని గంటలకే తమ్మినేని సీతారాం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగన్ తో భేటీ అయ్యారు. ఈ రెండు పరిణామాలు అనేక చర్చలకు తావిచ్చాయి. సీదిరి అప్పల్రాజును తొలగించి ఆయన స్థానంలో తమ్మినేని కేబినెట్ లోకి తీసుకోవచ్చని చెబుతున్నారు.

ముగిసిన క్యాబినేట్ కసరత్తు

నలుగురు లేదా ఐదుగురు కొత్తవారికి అవకాశం

కొందరు ఎమ్మెల్సీలకు చోటు

కొంత మంది మంత్రుల ఫోర్ట్ పోలియోల మార్పు.

గుడ్ ఫ్రైడే తర్వాత ఉండే అవకాశం

ఈ నెల మూడవ తేదిన మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest