మచిలీపట్నం
- SFI జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ పై పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారు.
కృష్ణా యూనివర్శిటీ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇటీవల విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
వీరి ఆందోళనకు నాయకత్వం వహించిన పవన్ కుమార్ వీసీ ఛాంబర్ పక్క రూమ్ లో కూర్చుని ఉండగా SI వాసు తన సిబ్బందితో కలిసి పవన్ వంటిపై బట్టలు ఊడదీసి మరీ పై ఫ్లోర్ నుంచి కింద వరకు లాక్కురావడం, ఆ తర్వాత యూనివర్శిటీ మెయిన్ డోర్ క్లోజ్ చేసి పవన్ డొక్కల్లో గుద్దారని SFI నేతలు ఆరోపిస్తున్నారు
పోలీసుల దాడిలో సొమ్మసిల్లి పడిపోయిన పవన్ ని ఆస్పత్రికి తరలించేందుకు 10 అంబులెన్స్ ను రాకుండా పోలీసులు అడ్డుకున్నారని SFI నేతలు ఆరోపిస్తున్నారు.
Post Views: 68