మహా శివరాత్రికి 3800 APSRTC ప్రత్యేక బస్సులు

 

  • ఎం.డి ద్వారకా తిరుమల రావు

విజయవాడ :

మహా శివరాత్రికి 3800 ప్రత్యేక బస్సులు APSRTC నడపనుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్ల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా మేరకు బస్సులు నడుస్తాయి. ఘాట్ రోడ్డులలో నైపుణ్యం కల్గిన డ్రైవర్లతో బస్సుల నిర్వహణ ఉంటుంది. కోటప్పకొండకు 675 బస్సులు, శ్రీశైలంకు 650 బస్సులు, పొలతలకు 200 బస్సులు, పట్టి సీమకు 100 బస్సులు నడుస్తాయి. ప్రయాణీకుల రద్దీని బట్టి అదనపు ట్రిప్పులు, బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ చేస్తారు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుస్తాయని ఎం.డి ద్వారకా తిరుమల రావు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest