పల్నాడు :
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై కేసు నమోదైంది. పుల్లారావుతో సహా 89 మంది చిలకలూరిపేట టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును తరలిస్తుండగా సంఘీభావంగా చిలకలూరిపేటలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాన్వాయ్‌ను అడ్డుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదు అయ్యాయి. రోడ్డుపై గుమ్మిగూడి రాకపోకలకు అంతరాయం కలిగించారని, దారిన వెళ్లే వాహనదారుడిపై దాడి చేశారని కూడా టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట పోలీసులు మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
Post Views: 12