- లోకేశ్ పాదయాత్రలో బాలకృష్ణ
- వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- ప్రజలంతా కళ్లు తెరిచి సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్న బాలయ్య
- కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శ
- చివరకు చెత్త మీద కూడా పన్ను వేశారని మండిపాటు
అనంతపురం :
శింగనమల నియోజకవర్గం…
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్ర లో
గంజాయి వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్ చేస్తున్న నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ.లోకేష్ పాదయాత్ర కి సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్న బాలకృష్ణ, యువత.గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి యువత కు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇస్తున్న నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ.గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న టీ షర్టులు, క్యాపులు ధరించిన యువత, టిడిపి నాయకులు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, టిడిపి కార్యకర్తలు, వాలంటీర్లు.గంజాయి కి ఏపి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అంటూ గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతి కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నారా లోకేష్.జగన్ పాలనలో ఏపి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారింది అంటూ ఆగ్రహం.ఆఖరికి తిరుమల ని కూడా వైసిపి గంజాయి మాఫియా వదలడం లేదు అంటూ లోకేష్ ఆగ్రహం. తిరుమల లో గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అన్న లోకేష్.గంజాయి వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.టిడిపి హయాంలో 40వేల కోట్ల రూపాయిలు విలువ చేసే గంజాయి ని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసిపి నాయకులు గంజాయి పంట వేస్తున్నారు.పాదయాత్ర లో ఉండగా చంద్రగిరి లో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయి కి బానిస అయ్యింది అని చెప్పింది. ఆ సంఘటన నన్ను కలచివేసింది.అందుకే గంజాయి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం.టిడిపి హయాంలో పెట్టిన డిఎడిక్షన్ సెంటర్లు కూడా వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసారు.యువత అంతా డ్రగ్స్, గంజాయి కి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నా.టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి గంజాయి మాఫియా పై చర్యలు తీసుకుంటాం.గంజాయి వద్దు బ్రో… యువత గంజాయి కి దూరంగా ఉండాలి అంటూ పిలుపు ఇచ్చిన లోకేష్.
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తోందో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై వైసీపీని ఎదుర్కోవాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలందరూ కళ్లు తెరిచి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని… ఇప్పటి వరకు నాలుగేళ్లయినా ఏమీ చేయలేదని విమర్శించారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్మని చేశారని ప్రశ్నించారు. ఒకవేళ అప్పులు చేశారే అనుకున్నా… ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఒక్క పరిశ్రమను కూడా తెచ్చింది లేదని… ప్రజలు బతుకుదెరువు కోసం వలస పోతున్నారని చెప్పారు. 4 లక్షల మందికి పెన్షన్లను నిలిపివేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని బాలయ్య చెప్పారు. గంజాయిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పెంచేశారని, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారని, అన్నిటి మీద పన్నులు పెంచేశారని, చివరకు చెత్త మీద కూడా పన్ను వేశారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.