ఢిల్లీ
వంగవీటి మోహన రంగా గురించి రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించారు.
దివంగత కాపు నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొంది ముష్కరుల చేతిలో రాజకీయ హత్యకు గురి అయ్యిన వంగవీటి మోహన రంగా గొప్పతనాన్ని పార్లమెంటులో ఎలుగెత్తి చాటారు. విజయవాడ లేదా మచిలీపట్నం జిల్లాల్లో ఒకదానికి ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో ఈ రోజు జీరో అవర్లో డిమాండ్ చేశారు.ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి వంగవీటి మోహన రంగా పేరు పెట్టడానికి ఎందుకు మనస్కరించలేదని నిలదీశారు. ప్రజల పెన్నిధిగా ఎదిగాడన్న కారణంగానే వంగవీటి మోహన రంగాను హతమార్చారని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కు వంగవీటి మోహన రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 63