రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంపై చంద్రబాబు నిరాశ

కేంద్ర బడ్జెట్ పై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

అమరావతి :

• ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామం
• వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా కేంద్ర బడ్జెట్ ప్రణాళికలు
• పోలవరం సహా రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించింది
• 31 మంది ఎంపిలు ఉండి కూడా వైసీపీ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయింది.
• కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉంది
• 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ…ఇప్పుడు 5వ స్థానంలోకి రావడం గొప్ప విషయం
• 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నా
• రైతులకు రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం కోసం రూ.79 వేల కోట్లు, ఆక్వారంగానికి రూ.6 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నా
• రవాణా రంగంలో 100 ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.
• ఆదాయపు పన్ను శ్లాబ్ లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారు.
• కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది.
• కర్నాటకలో కరువు ప్రాంతాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించారు…అయితే విభజన చట్టం ప్రకారం ఎపిలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా…. వాటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది
• పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం
• విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్… ఈ బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం
• 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు?
• ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పూర్తిగా చేతులు ఎత్తేశారు.
• సొంత కేసులు, స్వప్రయోజనాలకు మాత్రమే వైసీపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని రుజువైంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest