రుద్రవీణ లో సిరివెన్నెల రాసిన పంక్తులు ఆలోచింప‌ చేశాయి: పవన్

కృష్ణా:
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే మాట్లాడారు. సినిమా డైలాగులు సర్వసాధారణమే. నేను పార్టీ పెట్టిన సమయంలో నాతో ఎవ్వరూ లేరు. దారంతా గాడాంధకారం వంటి మాటలను ప్రేరణ గా తీసుకుని ముందుకు కదిలాను. .ఎందరో మహానుభావులు, త్యాగ మూర్తుల జీవితాలు నాకు ఆదర్శం. ఎపి ఆవిర్భావం కోసం పొట్టి శ్రీరాములు బలి దానం చేశారు. ఈ సమాజానికి ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. రుద్రవీణ లో సిరివెన్నెల రాసిన పని పూర్తి కాగానే తెప్ప తగలేస్తామా వంటి పంక్తులు నన్ను ఆలోచింప‌ చేశాయి. దోపిడీ విధానాలకు ఎదురు తిరగడానికి నేను పార్టీ పెట్టాను. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా.డబ్బు లేదు… పార్టీ నడపడం లో‌చాలా బాధలు ఉంటాయి.ధైర్యమే నా కవచం… ధైర్యం ఉంటే డబ్బు ఉన్నట్లే. నా రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది నాతో కలిసి నడిచారు. నేను దెబ్బతినే కొద్దీ ఇంకా బలపడుతున్నా. ఒక్కడితో ప్రారంభమైన జనసేన పులివెందుల తో సహా ప్రతి నియోజకవర్గం లో ఐదు‌వందల క్రియా శీలక కార్యకర్తలు నేడు ఉన్నారు. మాటలు పడ్డాం. మన్ననలు పొందాం.ఓరిమితో మాటలు పడ్డాం‌. అయినా నిలబడ్డాం.ఒక రోజు మన జనసేన అధికారం లోకి వస్తుంది. ధర్మో రక్షిత రక్షితః అనే సూత్రం నమ్ముతా. ఏడు సూత్రాలు ప్రధాన సిద్దాంతాలుగా పెట్టుకుని పని చేస్తున్నా. కులాలను‌ కలిపే ఆలోచన తో ముందుకు, ఒకరి కులాన్ని ఒకరు గౌరవించుకోవాలి. కుల కార్పొరేషన్ లు‌ వైసిపి ప్రారంభించింది… డబ్బులు మాత్రం ఇవ్వరు. మత్స్యకారులు అభివృద్ధి కోసం ఎనిమిది డిమాండ్ లు పెట్టారు. పోర్ట్ లను అభివృద్ధి చేస్తే మత్స్యకారులు జీవనోపాధి దెబ్బ తింటుంది. జిఒ 217ను నేను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు కు మద్దతు ఇచ్చాను. బిసి, కాపు సంఘాఒ నేతలను కలిశాను. వారంతా మార్పు కావాలని‌ కోరుకుంటున్నారు . రాజ్యాధికారం కోసం కాపు, బిసి, దళితులు, మైనారిటీ లు ఏకం కావాలి. సంఖ్యాబలం ఉండి కూడా దేహీ అనే పరిస్థితి ఉంది. కులాల్లో‌ ఉన్న అనైక్యత వల్లే వారు అభివృద్ధి సాధించడం లేదు. ఐక్యత లేకపోతే దేహీ అనే పరిస్థితి ఉంటుంది. వీరందరికీ జనసేన అండగా ఉంటుంది. ఒకే కులం అధికారం లో ఉండటం సరి కాదు. అగ్రకులాల్లో పేదల కు రిజర్వేషన్ కావాలి. ఒకనాడు రిజర్వేషన్ అంటే నొచ్చుకునే వారు… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతిభ ఉన్నా … మంచి మార్కులు వచ్చినా సీట్లు రాని పరిస్థితి. అగ్ర కులాల్లో పేదలకు నేను అండగా ఉంటాను. మంత్రులు కు దోచుకోవడానికి డబ్బులు ఉన్నాయి. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించడానికి డబ్బులు ఉండవు. జనసేన కు రాష్ట్ర బాధ్యత అప్పగిస్తే .. నేను మీకు అండగా ఉంటాను. నాకు తెలంగాణ సిఎం వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని రాశారు. పది‌వేల కోట్లు అని రాసి ఉంటే గౌరవం గా ఉండేది. డబ్బుతో గుండెల్లో అభిమానం పెంచుకోలేరు. ప్యాకేజీ అంటే చెప్పు తో కొడతా అని చెప్పా.మరోసారి ఇలా వాగితే చెప్పుతో కొడతా. డబ్బుకు ఆశపడే వ్యక్తి ని నేను కాను. నా దగ్గర ఉంటే ఇవ్వడమే నాకు తెలుసు. నేను రోజుకు రెండు కోట్లు వచ్చే అవకాశం ఉంది.


నాకు డబ్బు అవసరం ఏముంది. నేను చూడని సుఖాలా డబ్బా. ప్రభుత్వ ఉద్యోగి‌ కొడుకుని… కష్టం నాకు తెలుసు. పాలన మారాలని.. చెప్పే వారే మార్చే వారు లేరు. దూకు దూకు అన్నవారే. దూకేవాడు ఏడి. నే‌ను దూకేశా.అయినా నన్ను ఓడించారు. అయినా అధైర్యపడలేదు. జనం కోసం ముందుకు సాగుతున్నా. మీకుల నాయకులను యువత నిలదీయాలి. కార్పొరేషన్ పదవులు తీసుకుని ఏం‌చేశారని‌ ప్రశ్నించండి. నాకు అధికారం ఇస్తే ఫీజు రీయంబర్స్ మెంట్ తెస్తా. మీకు కూలీ వానిగా నేను పని చేస్తా. నేను‌‌ చంద్రబాబు కు సపోర్ట్ అని వాగుతుంటారు. నాకు‌ వంగవీటి మోహనరంగా అంటే చాలా గౌరవం. కాపుల కే‌ కాదు… చాలా మందికి ఆయన దైవం. నేను చిన్నప్పుడే రంగా గారిని కలిశాను. ఆయన్ని‌ చంపేస్తామంటే ఎందుకు అండగా ఉండలేదు. చనిపోయిన తరువాత ఎన్ని విగ్రహాలు పెడితే ఏంటి ప్రయోజనం. ఇలా మాట్లాడే వారికి నేను ఒకటే చెబుతా. రంగా గారు కమ్మవారి మహిళ ను‌చేసుకున్నారు. వాళ్ల అబ్బాయి వంగవీటి రాధాకృష్ణ బాగానే ఉన్నారు. వాళ్లకే లేని అభ్యంతరం సన్నాసులకు ఎందుకు.ఇంకా కులం కులం అని యువత మాట్లాడటం కరెక్టా? రెడ్టి సామాజిక వర్గం కు‌ చెందిన సిఎం కు కాపు నేతలు ఊడిగం చేయడం లేదా?ఒక కులం, ఒక మతం మీద ఆధారపడలేం
నా సినిమాలు అన్ని కులాల వారు‌ చూస్తేనే ఇలా ఎదిగా, కాపులతో నన్ను బూతులు తిట్టిస్తారు. కాపులు, బిసిలు తో తిట్టించి‌ కొందరు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలను అందరూ ఆలోచన చేయండి. ఏ కులాన్ని గద్దెనడక్కించడానికి నేను లేను.


అన్ని కులాలను కలపడమే నా లక్ష్యం. పూర్తి గా ఉచిత‌ విద్య ను అందించాలనేది నా తపన. ఓటు వేసే సమయంలో కులం కాదు… క్యారెక్టర్ చూడండి. మీరు అనుకున్న నేత మహానుభావుడు అయితే నేనే పోటీ నుంచి తప్పుకుంటా. బిజెపి తో పొత్తు అనగానే ముస్లిం సోదరులు నన్ను వదిలేస్తామని‌ చెబుతున్నారు. నేను పొత్తు లో ఉన్నంతకాలం ముస్లిం ల పై దాడి జరిగితే నేను బయటకి వచ్చేస్తా అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest