వారణాసిలో సతీసమేతంగా రఘురామకృష్ణరాజు పూజలు

 

వారణాసి

  • కాశీ విశ్వనాథస్వామి ఆలయ సందర్శన

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించారు. ఇక్కడి కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను రఘురామ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆదివారం ఉదయం వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారిని దర్శించుకున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థించాను. వారణాసిని ఎంతగానో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest