వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం సీరియస్

ఢిల్లీ

వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్న సుప్రీంకోర్టు

విచారణ పై తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు

వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదన్న సుప్రీంకోర్టు

దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదన్న సుప్రీంకోర్టు

దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సిబిఐ డైరక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్ కు ఆదేశించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్.

వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున మార్చాలని పిటిషన్.

దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కోర్టుకు తెలిపిన సిబిఐ తరపు న్యాయవాది

కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం.

గతంలో రాంసింగ్ పై కేసు పెట్టిన వివేకా హత్య కేసులో నిందితులు
రాంసింగ్ పై దాఖలైన పిటీషన్ ను గతంలో కొట్టేసిన ఏపీ హైకోర్టు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest