కడప :
వివేకా హత్య కేసు నిందితులను తెల్లవారు జామున 4 గంటలకు పోలీసులు తరలించారు. కడప జైలులో ఉన్న నిందితులను భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు తరలించారు. కడప జైల్లో ఉన్న ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 ఉమా శంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలను ఉదయం సీబీఐ కోర్టులో 10:30 గంటలకు హాజరు పరచనున్నారు. ఈ క్రమంలోనే వారిని కడప జైలు నుంచి హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. ఈ కేసులో నిందితులైన ఏ1ఎర్ర గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్ దస్తగిరిలు బెయిల్‌పై ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Post Views: 40