శాసనమండలి వైయస్సార్ పార్టీ అభ్యర్థులు ఖరారు ?

 

  • సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం
  • బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట
  • కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

గుంటూరు:

శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచించినట్లుగా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో నెల్లూరు నుంచి మేరీ గ మురళీధర్ (గూడూరు), కడప నుంచి పి. రామ సుబ్బారెడ్డి (మాజీ మంత్రి జమ్మల మడుగు), తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళం వెంకటరమణ (మాజీ ఎమ్మెల్యే కైకలూరు), అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి . నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావు ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో ఒకరికి, బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన విషయం విదితమే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest