(కృష్ణాజిల్లా)అవనిగడ్డ
వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి తరలివచ్చిన యాత్రికులు, భక్తులు..కట్టు దట్టమైన పోలీస్ బందోబస్తు…లక్ష మంది పైగా భక్తులు తరలివచ్చారని అంచనా..సముద్రతీరం వద్దకు వెళ్లడానికి భారీగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ అంతరాయం…అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు మండలం హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణ సాగర సంగమం, సముద్ర తీరాలు వద్దకు పుణ్య స్థానాలు ఆచరించడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది…అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు కడవకోల్లు నరసింహారావుల దంతులు సముద్రునీకీ ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్థానాలు ఆచరించారు..అనంతరం కృష్ణ సాగర సంగమం ప్రదేశంలో అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్థానాలను ప్రారంభించారు..సాగర సంగమం వద్ద ఉన్న కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాఘశుద్దపౌర్ణమి రోజున రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని తిలకించి సముద్రం తీరంలో పుణ్య స్థానాలు ఆచరిస్తే పాపాలు పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పాలకాయ తిప్ప నుంచి సముద్ర తీరం వరకు వెళ్లే రహదారిపై వావానదారులక ట్రాఫిక్ తీవ్ర రఅంతరాయం ఏర్పడింది. పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాటానికిపోలీసులు ఇబ్బందులు పడుతున్నారు..
నూతనంగా వివాహం యిన దంపతులు బ్రహ్మముడులతోసూర్యదోయ సమయంలో సముద్రునికి నమస్కరించి తమతమ మెక్కులు తీర్చుకున్ని పుణ్య స్థానాలు ఆచరించారు..
యువకుల కేరింతలు, సముద్రుని అలలు ఘోష, యాత్రికులు భక్తులు స్థానాలు ఆచరించి ఆనందంగా గడిపారు..
సాగర సంగమంప్రదేశం వద్ద సముద్రంలో స్థానాలు ఆచరించడానికి భక్తులుఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే జల్లు స్థానాలు ఏర్పాటు చేశారు.