అమరావతి
ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐ ఏ ఎల్ అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు అరెస్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ముప్పాళ్ళ సుబ్బారావును రాజానగరం పోలీస్ స్టేషన్ లో నిర్బందించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ వామపక్ష నేతల అరెస్టులు, గృహనిర్బంధాలు దుర్మార్గం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 1 ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Post Views: 53