అమరావతి :
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పురోగతి లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 49లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. యూపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారిణి అపర్ణ భర్త జీవీఎస్ భాస్కర్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటేషన్‌పై అపర్ణ పని చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో అపర్ణ ఉన్న సమయంలో కుంభకోణం జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.
కుంభకోణంలో అపర్ణ భర్త కీలకంగా వ్యవహరించినట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. భాస్కర్ సమాచారం ఆధారంగా తాజాగా సోదాలు నిర్వహించారు.
Post Views: 54