మంగళగిరి
మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో 100 అడుగులు భారీ జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. దీనికోసం జెండాను సిద్ధం చేశారు. జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ జెండాను ఆవిష్కరిస్తారు. రెండు భారీ క్రేన్ లతో 100 అడుగులు జెండా పోల్ ను సిద్ధం చేశారు. హైవే పై నుంచి అన్ని వైపులా జన సేన పార్టీ క్లియర్ గా కనబడేలా జెండాను ప్లాన్ చేశారు.
మంగళగిరి హైవే పై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా జన సేన పార్టీ జెండా ఉంటుందని జనసేన కార్యకర్తలు అంటున్నారు.
జన సేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళగిరి కార్యాలయం భారీ జన సేన పార్టీ జెండా ఏర్పాటు చేశారు.
Post Views: 36