విజయవాడ
ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు ముందుకు వేశామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు వెల్లడించారు.మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీగా సొంత బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుందని చెప్పారు. 2736 కొత్త బస్సులు కొనుగోలుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు, జీసీసీ మోడల్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు,200 డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నామని అన్నారు. కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో త్వరలోనే ఒప్పందాలు కుదుర్చుకుంటామని తిరుమలరావు తెలిపారు.
Post Views: 48