అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా దీవెన పథకం ద్వారా 9.86 లక్షల మంది విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ గొప్ప పథకం విద్యార్థుల చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈ రోజు 8.91 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.698 కోట్ల ను బటన్ నొక్కి నేరుగా జమ చేయడం జరుగుతోంది. తద్వారా తల్లులు తమ పిల్లల చదువులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పని వుండదు.