* జిల్లా కలెక్టర్ట్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున
విశాఖపట్నం, మార్చి-27:-
జి-20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా కలక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు. సోమావారం ఆయన జివిఎంసీ కమిషనర్ పి రాజాబాబు, పోలీసు కమిషనర్ శ్రీ కాంత్ తో కలసి విశాఖ ఎయిర్ పోర్టు నుండి ఎన్ఎడి, మురళీనగర్, 24×7 త్రాగు నీరు ప్రాజెక్టు, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై-ఓవర్, సిరిపురం, ఎయు బస్ స్టాప్, స్మార్ట్ సిటీ ఉడా పార్కు, సీతకొండ వ్యూ పాయింట్, గుడ్లవానిపాలెం, సాగర్ నగర్, ర్యాడిసన్ బ్లూ హోటల్ వరకు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ నగరానికి విచ్చేయుచున్న దేశవిదేశీయుల ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని, వచ్చిన అతిధులకు లైజనింగ్ అఫీసర్సును ఏర్పాటు చేసామని తెలిపారు. అలాగే వారు ప్రయాణించే మార్గాన్ని జివిఎంసి కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సుందరీకరణ పనులు, రోడ్లు, విద్యుత్ ఏర్పాటు చేసారని, వారికి భద్రత ఏర్పాట్లు పోలీసు కమిషనర్ పూర్తి స్థాయిలో సమీక్షిస్తునారని తెలిపారు.
అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ అతిధులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యంగా ఎయిర్ పోర్టు నుండి ర్యాడిసన్ బ్లూ హోటల్ వరకు సుందరీకరణ పనులు రోడ్డు మార్గాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని, అతిధులు మురళీనగర్ లోని 24 x 7 తాగు నీరు ప్రాజెక్టును సందర్శించనందున అక్కడ ఏర్పాట్లను కలక్టర్, కమిషనర్ తో కలసి పరిశీలించమని, తెలుగుతల్లి ఫ్లై-ఓవర్ వద్ద ఆకర్షణీయమైన పెయింటింగు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. ఉడా పార్కులో పైలాన్ సాగర్ నగర్ “వ్యూ” పాయింట్, గుడ్లవానిపాలెం, సాగర్ నగర్ వరకు సుందరీకరణాన్ని, విద్యుత్ పనులు పూర్తిఆయ్యాయన్నారు.
తదుపరి పోలీసు కమిషనర్ మాట్లాడుతూ నగరానికి వచ్చే అతిధులకు ఎటువంటి ట్రాఫిక్ తో పాటూ బధ్రతతో కూడిన అన్ని చర్యలూ తీసుకున్నామని, 2500 మంది పోలీసులతో బద్రత ఏర్పాటుచేశామని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా దారి పొడుగునా బధ్రతా చర్యలు చేపట్టామని తెలిపారు