ప్రీతి నీకు మరణం అంటే ఎందుకంత ప్రీతి
ప్రీతి నీకు బ్రతకడం అంటే ఎందుకంత బీతి
చైనా జపాన్ యుద్ధంలో
చైనా మిలిటరీ కి ప్రజలకు
వైద్య సహాయం చేసి తన ప్రాణాన్ని
త్యాగం చేసిన డాక్టర్ కోట్నిస్
నీ గుండెల్లో జయించలేదా
అమెరికా సామ్రాజవాదాన్ని ఎదిరించే
పోరాటంలో భాగమై ఆ పోరాటానికి
నాయకత్వం వహిస్తున్న కామ్రేడ్ చే
తన శరీరాన్ని ప్రయోగాశాలగా మార్చి
క్యాడర్ కి ఇంజక్షన్లు ఎలా ఇవ్వాలో చూపించిన
ప్రపంచ పీడిత ప్రజల డాక్టర్
కామ్రేడ్ చేగువేరా
నీ మనసులో పుష్పించలేదా??
అంతెందుకు మీ వరంగల్ జిల్లాలో
పిల్లల పసి హృదయాలను గెలుచుకున్న
డాక్టర్ రామనాథంని
నీ స్టెతస్కోప్ పసిగట్టలేదా మిత్రమా??
ఆదివాసి గూడాలల్లో
ప్రపంచ పీడిత ప్రజలకు
అండగా నిలిచిన, నిలుస్తున్న
ప్రజల డాక్టర్ల పల్స్ రేట్
నీ చేయితో స్పర్శించలేదా నేస్తమా??
ప్రజల కోసం వైద్య వృత్తిని, ప్రాణాన్ని
గడ్డిపరకలాగా చూసే ఏ ఒక్క డాక్టర్
నీకు గుర్తుకు వచ్చిన నువ్వు ఈ పని
చేసుకునే దానివి కాదు
పోరాడి నిలబడదానివి గెలిచేదానివి
ఏది ఏమైనా పచ్చని అడవి తల్లి
ప్రాణం పోసే ఒక ఆకుపసరును కోల్పోయింది
జోహార్లు ప్రీతి
Ranjith Edugu ADV HC