హైదరాబాద్, 27 ఫిబ్రవరి 2023:
అమర రాజా బ్యాటరీస్ ఇటీవల ఈ-హబ్ అని పిలిచే తమ అడ్వాన్స్‌డ్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు GMR ఏరోస్పేస్ & ఇండస్ట్రియల్ పార్క్, ఏరోసిటీ హైదరాబాద్‌తో ల్యాండ్ లీజు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సెంటర్ భారతదేశంలో ఎనర్జీ స్టోరేజ్ కోసం అధునాతన క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుంది. ఏరోసిటీలోని ఇండస్ట్రియల్ జోన్‌లో దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ R&D కేంద్రం విస్తరించి ఉంటుంది. విమానాశ్రయానికి దగ్గరలో ఉండడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమీపంలోని ఇతర పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని, ఈ సెంటర్ కారణంగా ఏరోసిటీ హైదరాబాద్‌లో గ్రీన్ పవర్ స్టోరేజ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంక్యుబేషన్, ల్యాబ్ స్పేస్‌లు, సహకార పర్యావరణ వ్యవస్థ ద్వారా ఈ సెంటర్ స్టార్టప్‌లకు సహకరిస్తుంది.
GMR ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ CEO అమన్ కపూర్, “GMR ఏరోసిటీ హైదరాబాద్ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించి, పర్యావరణపరంగా స్థిరమైన భవిష్యత్తును నడిపించే వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. అమర రాజా బ్యాటరీస్‌తో భాగస్వామ్యం ఈ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి. ఏరోసిటీ హైదరాబాద్‌లోని సుస్థిర కార్యకలాపాలు, EDGE వంటి సర్టిఫికేషన్ల దృష్ట్యా గ్రీన్ సొల్యూషన్స్ దిశగా పనిచేస్తున్న ఏ సంస్థకైనా మేం ఉత్తమ భాగస్వామిగా ఉంటాము.’’ అన్నారు.
అమర రాజా బ్యాటరీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని మాట్లాడుతూ “అమర రాజా రూ.9,500 కోట్ల గిగాకారిడార్ కార్యక్రమంలో ఈ-హబ్ ఒక భాగం. నూతన రకమైన శక్తుల విషయంలో సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన సదుపాయం. దీనిలో మెటీరియల్ రీసెర్చ్, ప్రోటోటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్‌సైకిల్ అనాలిసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రదర్శనల కోసం ప్రయోగశాలలు, టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఉంటాయి. శక్తి, మొబిలిటీ రీసర్చ్ పరిశోధన విషయంలో ఇది హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌పై ఉంచుతుందని నేను విశ్వసిస్తున్నాను.’’ అన్నారు.
GMR ఏరోసిటీ హైదరాబాద్ అనేది బిజినెస్ పార్క్, రిటైల్ పార్క్, ఏరోస్పేస్ మరియు ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్స్ పార్క్, ఇనిస్టిట్యూషనల్ జోన్ మరియు హాస్పిటాలిటీ వంటి కీలకమైన పోర్టులు, ఎస్టాబ్లిష్మెంటులు కలిగిన సమగ్ర మిశ్రమ-వినియోగ అభివృద్ధి ప్రదేశం. ఇది కాలుష్య రహిత వాతావరణంలో సమకాలీన మౌలిక సదుపాయాల డిజైన్లను అందిస్తుంది. ఇది విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థతో సజావుగా అనుసంధానించబడివన్నీ ఒకే చోట ఉన్న వన్-స్టాప్ గమ్యం.
అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ (ARBL) భారతీయ స్టోరేట్ బ్యాటరీ పరిశ్రమలో పారిశ్రామిక, ఆటోమోటివ్ అప్లికేషన్‌ల కోసం లెడ్-యాసిడ్ బ్యాటరీల అతిపెద్ద తయారీదారులలో ఒకటి. అలాగే ARBL గృహ UPS/ఇన్వర్టర్ బ్యాటరీలు, ఆటోమోటివ్ బ్యాటరీల తయారీలో మార్కెట్‌లో ప్రముఖ స్థానంలో ఉంది.