ఇండస్ట్రీలో ఇమడలేకపోయాను:దివ్యవాణి

దివ్యవాణి నిన్నటితరం కథానాయికగా ప్రేక్షకులకి గుర్తుండిపోయారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమె కొన్ని సినిమాల్లో కనిపించారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యవాణి మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

‘ముత్యమంత ముద్దు’ సినిమాలో ఒక చిన్నపాత్ర చేసిన నన్ను బాపు గారు చూసి, ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. అదే ఏడాదిలో నేను చేసిన ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ .. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ సినిమాలు హిట్ అయ్యాయి. అలా ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ హిట్ కొట్టాను” అన్నారు.

బాపు గారి దర్శకత్వంలో ఆ తరువాత వచ్చిన ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో కూడా నేను చేయవలసిందే .. కానీ ఆ అవకాశం దక్కలేదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి .. అవి బయటికి చెప్పలేను. బాపు బొమ్మగా పేరు వచ్చిన తరువాత చాలానే ఆఫర్లు వచ్చాయి. కానీ నా పద్ధతి వేరు .. నా స్వభావం వేరు ..అందువల్లనే ఆ ఛాన్సులను అందుకోలేకపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఇమడలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest