‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ షురూ

* ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్
* పోలీస్ స్టేషన్ సెట్ లో బుధవారం ప్రారంభమైన షూటింగ్
* మొదటి షెడ్యుల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు(బుధవారం) నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి షెడ్యూల్ జరగనుంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క ‘గబ్బర్ సింగ్’ సినిమానే అయినప్పటికీ..  ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కారణంగా వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘గబ్బర్ సింగ్’ని మించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని దర్శకుడు హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నారు.
ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఘన విజయంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సంగీతంతో అలరించడానికి దేవిశ్రీ ప్రసాద్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు
రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సీఈవో: చెర్రీ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:
రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పాయ్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh, produced by Mythri Movie Makers, goes on floors
Pawan Kalyan has joined hands with blockbuster director Harish Shankar again for an action entertainer Ustaad Bhagat Singh, which was launched amidst pomp and fanfare recently. The much-anticipated film is bankrolled by Y Ravi Shankar and Naveen Yerneni under Mythri Movie Makers. The film officially went on floors today.
The first schedule of the film will progress at a specially erected police station set over a week featuring Pawan Kalyan and other lead actors. Cinematographer Ayananka Bose, production designer Anand Sai and director Harish Shankar extensively worked on the pre-production of the shoot and they’re confident of surpassing viewer’s expectations with an entertaining film.
A new poster of the film, featuring Pawan Kalyan in a flamboyant avatar, was unveiled by the makers and the star looks effortlessly stylish and at ease in this look. Several big names have been finalised for Ustaad Bhagat Singh’s cast. Telugu cinema’s most happening heroine Sreeleela is on board as the heroine while Ashutosh Rana, Nawab Shah, KGF fame Avinash, Gauthami, Narra Srinu, Naga Mahesh and  Temper Vamsi essay supporting roles
The film beyond cinematographer Ayananka Bose and art director Anand Sai, comprises a top-notch technical team, including editor Chota K Prasad. Noted music director behind hits like Jalsa, Gabbar Singh, Attarintiki Daredi, Pushpa and Rangasthalam, Devi Sri Prasad, is the composer.
Stunt director duo Ram-Lakshman choreograph the action sequences. Leading production house Mythri Movie Makers, which backed hits like Waltair Veerayya, Veera Simha Reddy this year, looks set to continue their victorious run with this ambitious project.
Screen Play: k.Dasaradh
DOP: Ayananka Bose
Music: Devisriprasad
Editor: Chota k prasad
Additional writer: C. Chandramohan
Production Designer: Anand sai
Fights: Ram – Laxman
Executive producers: ChandraSekhar Ravipati, Harish Pai
Ceo: Cherry
Producers: Naveen Yerneni, Y.Ravi Shankar
Written & Directed by Harish Shankar. S
Banner: Mythri  Movie Makers
pro: Lakshmivenugopal
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest