ఏప్రిల్ 21 రాబోతోన్న ‘హలో మీరా’

ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు, ఎన్నో విభిన్న కారెక్టర్లుంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయొచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇది వరకు ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా హలో మీరా అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి.
ఆ సాహసాన్ని హలో మీరా అంటూ ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ ‘హలో మీరా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల శ్రీనివాసు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. హలో మీరా మీద మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం, ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై ప్రశంసలు కురిపించారు.
హలో మీరా సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతోన్నట్టుగా నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఎస్ చిన్న సంగీతం అందించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్‌గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు.
కథ ,స్క్రీన్ ప్లే, దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల
ప్రొడ్యూసర్స్: డా: లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
సమర్పణ : జీవన్ కాకర్ల
మ్యూజిక్: ఎస్ చిన్న
మాటలు  హిరణ్మయి కళ్యాణ్
ఎడిటర్: రాంబాబు మేడికొండ
పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి
మేకప్: పి రాంబాబు
అసోసియేట్ డైరెక్టర్: సూరి సాధనాల
ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై]
పాటలు: శ్రీ సాయి కిరణ్
సింగర్స్:  సమీరా భరద్వాజ్ ,దీపక్ బ్లూ
సౌండ్ డిజైనర్: శరత్  [సౌండ్ పోస్ట్]
ఆడియోగ్రఫీ: ఎం  గీత గురప్ప
పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ డిజిటల్స్
పీఆర్వో : సాయి సతీష్
Single Character Movie Hello Meera Receives Clean U Certificate, Releasing On April 21st
The upcoming film Hello Meera is an intriguing and experimental film that stars only a single character. As we have seen in the teaser and other promotional material, this is going to be a gripping thriller. Meanwhile, the movie is done with its censor formalities and it received a clean U certificate. The makers have announced to release of the movie on April 21st.
The censor officials have appreciated the makers for coming up with an experimental movie and making it captivatingly all through. The film made as a suspense drama thriller will give the audience an edge-of-seat experience. It will have a good dose of emotions and drama too.
Kakarla Srinivas, who was the protégé of legendary filmmaker Bapu and has vast experience, is making his directorial debut with the movie. Jeevan Kakarla is presenting this experimental film under the banner of Lumiere Cinema.
S Chinna scored music and the film’s first single was well-received. Dr. Lakshmana Rao Dikkala, Varaprasadarao Dumpala and Padma Kakarla produced the movie, while Rambabu Medikonda is the editor. Tirumala M Tirupati is the Production Designer, whereas Katri Mallesh, and M Rambabu [Chennai] are the Production Managers. Suri Sadhanala worked as an associate director.
Story, Screenplay, Direction: Srinivas Kakarla
Producers: Dr. Lakshmana Rao Dikkala, Varaprasadarao Dumpala, Padma Kakarla
Presents: Jeevan Kakarla
Banner: Lumiere Cinema
Music: S Chinna
Production Designer: Tirumala M Tirupati
Makeup: P Rambabu
Associate Director: Suri Sadhanala
Production Managers: Katri Mallesh, M Rambabu [Chennai]
Lyrics: Sri Sai Kiran
Singers: Sameera Bhardwaj, Deepak Blue
Sound Designer: Sarath [Sound Post]
Audiography: M Geetha Gurappa
Publicity Designer: Krishna Digitals
Dialogues: Hiranmayi Kalyan
Editor: Rambabu Medikonda
PRO: Sai Satish
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest