కీరవాణికి కంగ్రాట్స్ చెప్పిన ఏఆర్ రెహమాన్, మెగాస్టార్

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు ఈ అవార్డ్స్‌ కోసం అనేక కేటగిరీల్లో పోటీపడుతున్నాయి.

ఇక భారత్ నుంచి మొదటిసారి ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు (Natu Natu) సాంగ్ అవార్డ్ గెలుచుకుంది. టాలీవుడ్‌లో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటర్నేషనల్ అవార్డు స్వీకరించడం పట్ల పలువురు ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవితో పాటు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ట్విట్టర్‌లో విషెస్ తెలిపారు.

ఈ మూమెంట్‌ను చారిత్రక విజయంగా పేర్కొన్న చిరంజీవి.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న కీరవాణికి సెల్యూట్ చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీ నాటు నాటు సాంగ్‌తో ఇండియా గర్విస్తోంది అంటూ ట్వీట్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest