ఘనంగా పూజా కార్యక్రమాలతో ‘గాంగేయ’ మూవీ ప్రారంభం

ఎం విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. హేమ కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం గాంగేయ. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సముద్ర క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
 అనంతరం చిత్ర దర్శకుడు బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ..* రామానాయుడు గారిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను నిర్మిస్తున్నాం. దేశ జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా.. కుల మత బేధాలు లేకుండా మనిషి మనిషిని ప్రేమిస్తేనే శాంతి చేకూరుతుందనే పాయింట్ మీద సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో నిర్మిస్తున్నామ’ అని అన్నారు.
నిర్మాత టి. హేమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..* ‘గాంగేయ సినిమాను నేడు ప్రారంభించాం. అందరి సహకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. నేడు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థాంక్స్’ అని అన్నారు. ఎం విజయ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘చాలా మంచి కథతో ఈ సినిమా రాబోతోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో గగన్ విహారి మాట్లాడుతూ..’అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా ఇది. దైవ భక్తి, దేశ భక్తి, ప్రేమ కథ ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మంచి సినిమాను తీయాలని మా నిర్మాతలు ఎంతో కష్టపడుతున్నారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి’ అని అన్నారు.
హీరోయిన్ అవ్యుక్త మాట్లాడుతూ..* ‘తెలుగులో నాకు ఇది మొదటి చిత్రం. ఈ సినిమా కథ, స్క్రిప్ట్ ఎంతో బాగుంది’ అని అన్నారు.
గగన్ విహారి, అవ్యుక్త, టీ. హేమ కుమార్ రెడ్డి, సీనియర్ నటుడు సుమన్ గారు, ఎం విజయ శేఖర్ రెడ్డి, ది జంక్, రణధీర్, అలోక్ జైన్, హీరా మాధురి, జయవాణి, జోహర్, చంద్ర శేఖర్, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఖదీర్, దాసన్న తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
సాంకేతిక బృందం
బ్యానర్ : విజయ గౌతమి ఆర్ట్స్ మూవీస్
నిర్మాత : టీ. హేమ కుమార్ రెడ్డి
సమర్ఫణ : ఎం. విజయ శేఖర్ రెడ్డి
దర్శకత్వం : బి. రామచంద్ర శ్రీనివాస కుమార్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం : ర్యాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫీ : అడుసుమిల్లి విజయ్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్  : వాసు
పీఆర్వో : సాయి సతీష్‌
Gagaan Viharri, B Raamachandra Srinivasa Kumaar, Vijaya Gowthamy Art Movies Production No 1 Gaangeaya Launched Grandly
We hardly get to see movies that can be watched with all the family members. B Raamachandra Srinivasa Kumaar is debuting as director with the upcoming flick Gaangeaya which will have elements for all sections of audiences. The movie will have patriotic elements and discusses various issues, though it will be made as a perfect family entertainer. The film to be produced by T Hema Kumar Reddy under the banner of Vijaya Gowthamy Art Movies and presented by M Vijaya Sekhar Reddy has been launched today grandly with a pooja ceremony.
For the muhurtham shot, producer M Vijaya Sekhar Reddy switched on the camera, while popular director Samudra who graced the occasion as a special guest sounded the clapboard. Gagaan Viharri who played the lead in the film Dharmapuri is playing the hero, while Avyuktha is the heroine opposite him. T Hema Kumar Reddy and senior actor Suman will be seen as powerful police officers.
While speaking at the launching event, the director B Raamachandra Srinivasa Kumaar said, “Today, our film Gaangeaya as the production no 1 of Vijaya Gowthamy Art Movies has been launched. Gaangeaya is a family movie. Not the caste or religious system, but peace will come to this world the day human respects and loves each other. It’s equally important to create unity and harmony among people in our country. The movie will discuss many valid points. We will be releasing this movie in 5 languages.”
Rap Rock Shakeel will score the music, while cinematography will be handled by Adusimilli Vijay Kumar. Kotagiri Venkateswara Rao will take care of editing and Vaasu is the art director.
Cast: Gagaan Viharri, Avyuktha, T Hema Kumar Reddy, Senior actor Suman, M Vijaya Sekhar Reddy, The Jaank, Ranadheer, Alok Jain, Heera Madhuri, Jayavani, Johar, Chandra Sekhar, Muralidhar Reddy, Bhaskar Reddy, Khadeer, and Dasana.
Technical Crew:
Story, screenplay, dialogues, direction: B Raamachandra Srinivasa Kumaar
Presents: M Vijaya Sekhar Reddy
Banner: Vijaya Gowthamy Art Movies
Producer: T Hema Kumar Reddy
Music: Rap Rock Shakeel
DOP: Adusimilli Vijay Kumar
Editor: Kotagiri Venkateswara Rao
Art Director: Vaasu
PRO: Sai Satish
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest