జబర్దస్త్ కొత్త యాంకర్ కి అప్పుడే సినిమా లో ఛాన్స్.. 

జబర్దస్త్ కొత్త యాంకర్ గా సౌమ్య ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెను మొదట మూడు లేదా ఐదు ఎపిసోడ్స్ కి మాత్రమే యాంకర్ గా అనుకున్నారు.

కానీ జబర్దస్త్ లో ఆమె ఇమిడి పోయింది. ప్రేక్షకులకు నచ్చేసింది. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆమె యాంకరింగ్ ను ఇష్టపడుతున్నారు. అందుకే ఇక నుండి ఆమె జబర్దస్త్ పర్మినెంట్ యాంకర్ గా వ్యవహరించబోతుందని మల్లెమాల వారు పేర్కొన్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో కనిపిస్తే చాలు సినిమాల్లో అవకాశాలు వస్తాయని మరో సారి సౌమ్య ద్వారా వెళ్లడైంది.

సౌమ్య ఎంట్రీ ఇచ్చి కనీసం రెండు నెలలు కూడా కాక ముందే అప్పుడే నటిగా ఛాన్స్ దక్కించుకుంది. ఒక యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఒక చిన్న సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కూడా ఈమె సొంతం చేసుకుందట. మొత్తానికి జబర్దస్త్ తీసుకు వచ్చిన క్రేజ్ తో వెండి తెరకు ఈమె పరిచయం కాబోతుంది. బుల్లి తెరపై చాలా కాలంగా ఈమె సందడి చేస్తోంది, కానీ జబర్దస్త్ ద్వారా వచ్చినంత పాపులారిటీ ఎప్పుడు కూడా ఈమెకు రాలేదు.


భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. కనుక ముందు ముందు ఈమెకు మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జబర్దస్త్ తో పాటు ఈటీవీలోనే ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో కూడా సౌమ్య సందడి చేసే అవకాశం ఉంది. మరో వైపు సినిమాల్లో కూడా అనసూయ మాదిరిగా బిజీ అయ్యి అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. సౌమ్య అందంగా ఉండటంతో పాటు చలాకీగా మాట్లాడుతుంది కనుక ఈ క్రేజ్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest