డిస్నీ+హాట్ స్టార్ లో రానున్న హన్సిక పెళ్ళి వీడియో

‘హన్సికాస్ లవ్, షాదీ, డ్రామా’ పేరుతో డిస్నీ+హాట్ స్టార్ లో రానున్న హన్సిక పెళ్ళి వీడియో, ట్రైలర్ విడుదల!!

సొట్టబుగ్గల సుందరి ‘హన్సిక మోత్వాని’ తన నటనతో, అందంతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయకుల సరసన నటించిన తనకి ఇటీవల సోహైల్ ఖతూరితో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగిన వీరి పెళ్ళి వీడియోని ‘హన్సికాస్ లవ్, షాదీ, డ్రామా’ పేరుతో డిస్నీ+హాట్ స్టార్ లో ఫిబ్రవరి 10న విడుదల చేయనుండగా దానికి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు విడుదల చేసారు.

ఎంతో మంది ఆశీస్సులతో జరిగిన ఈ పెళ్ళిలోని ఎన్నో భావోద్వేగాల కూర్పుగా ఈ వీడియో ఉండబోతుందని తెలుస్తుంది.

జైపూర్ ముందోటా కోట మరియు రాజ భవనంలో అద్భుతమైన కలలా జరిపిన ఈ వివాహ ప్రణాళిక, నిర్వాహణ కేవలం 6 నెలల్లో జరిగింది.

హన్సిక పెళ్ళికి ఒప్పుకున్న దగ్గరినుండి వెడ్డింగ్ ప్లానర్ల సైన్యం, డిజైనర్ల హడావిడి, కుటుంబ సభ్యుల ఉత్సాహం మధ్యన అంగరంగ వైభవంగా సంబరం లా జరిగిన ఈ వివాహం వెనుక జరిగిన హాస్యాలు, విపరీత పరిస్థితులు వాటి ప్రభావాలు అభిమానులతో పాటు చూసే ప్రతీ ప్రేక్షకుడికి ఆసక్తిరేపేలా ఉండబోతున్నాయి.

పెళ్లికి కేవలం కొన్ని రోజుల ముందే హన్సిక పై వైరల్ అయిన దుష్ప్రచారాన్ని తన కుటుంబం లో ఎలాంటి అలజడి రేపింది. వారి మద్దతుతోనే ఆ పరిస్థితులని ఎలా ఎదురుకుంది వంటి అంతర్గత విషయాలు కూడా ఈ వీడియోలో ఉండనున్నాయని తెలియడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సందర్బంగా హన్సిక మాట్లాడుతూ “చిన్నప్పటి నుండి నా పెళ్ళి గురించి అందమైన కలలుండేవి నాకు. సోహైల్ తో నా ఎంగేజిమెంట్ అయినప్పుడు నా కల నిజమవుతుందనిపించింది, నా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ప్రతీ క్షణం మా కళ్ళ ముందు ఎప్పటికీ ఉండాలని ఈ వేడుకలోని ప్రతీ సందర్బం వీడియో తీయాలనుకున్నాం. నా డ్రీమ్ వెన్యూ అయిన ముందోటా కోట మరియు పాలస్ లో పెళ్ళి జరిగింది. పెళ్ళి కోసం నేను అనుకున్నట్టుగా ప్రతీ విషయం జరగటానికి 6 వారాలు పట్టింది. నవ్వులు, ఏడ్పులు, చిన్న చిన్న గొడవలు అన్ని కలగలిసిన ఓ అద్భుతమైన వేడుకలా జరిగింది. ఈ సంతోషాన్ని నా అభిమానులు, శ్రేయోభిలాషులతో కూడా పంచుకుందామనిపించగా అందుకు డిస్నీ+హాట్ స్టార్ సరైన వేదిక అనిపించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest