నిర్మాతల మండలికి పోటీపడేది వీళ్ళే

హైదరాబాద్:

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు 19వ తేదీ (ఆదివారం) జరుగుతాయి. ఉదయం 9 గంటలకు ఈ ఎన్నకలు ప్రాంరంభం అవుతాయి. మధ్యాహ్నం తరువాత కౌంటింగ్ ఉండ్తుంది. 2023-2025 ఏడాది కోసం జరుగనున్న ఎన్నికల్లో 1200 మంది సభ్యులు ఉన్నారు. నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్, జెమిని కిరణ్ పోటీ పడుతున్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఉన్న నిర్మాతలు అందరు దామోదర్ ప్రసాద్ కు మద్దత్తు తెలుపుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసీ మెంబర్ గా దామోదర్ ప్రసాద్ ప్యానెల్ లో పోటీకి నిలిచారు. జెమిని కిరణ్ కు సి. కళ్యాణ్ మద్దత్తు ఉంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేరుతో జెమిని కిరణ్, ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ పేరుతో దామోదర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై నిర్మాత సి. కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక మాఫియ ముఠా అని కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest