బేబీ మూవీతో తెలుగుకు పరిచయం అవుతున్న సింగర్ ఆర్య దయాళ్ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య విడుదల చేసిన “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” లిరికల్ సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి గొప్ప స్పందన వచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచగా అద్భుతమైన మెలోడీగా ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ గా నిలిచిందీ గీతం. ఇక అంతకు మించిన మెలోడీతో మరో పాటతో సిద్ధమైంది బేబీ మూవీ టీమ్. ఈ సారి మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాల్ చేత ఈ రెండో పాటను పాడించడం విశేషం. అంతేకాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా పాటలాగా ఆర్య దయాల్ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియోగానూ చేశారు. త్వరలోనే ఈపాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సింగర్ చేత చేయించిన లిరికల్ వీడియో  పూర్తయిన సందర్భంగా

చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “. బేబీ ఫస్ట్ సాంగ్ ఓ పెద్దసెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో 20 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అందుకే తర్వాతి అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మళయాలీ సింగర్ ఆర్య దయాల్ చేత ఈ పాటను పాడించాం.  తన ప్రైవేట్ సాంగ్స్, యూ ట్యూబ్ షాట్స్, ఇంతకు ముందు పాడిన పాటలకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. నేను కూడా తనకు అభిమానిని. ఈ పాటను మా మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి తన కోసమే కంపోజ్ చేశాం. తనతోనే పాడించాలని నిర్ణయించుకున్నాం. ఈ పాట మొదటి పాటకు ఏ మాత్రం తీసిపోదు. ఇక ఫస్ట్ సాంగ్ కు మించి ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఓ పాటకు పెట్టాల్సినంత బడ్జెట్ ను ప్రమోషనల్ మ్యూజికల్ వీడియోకే పెట్టారు. ఆర్యదయాల్ మొదటి పాట నా సినిమాలోనిది కావడం గర్వంగా ఉంది. ఈ పాట తర్వాత తెలుగు ప్రజలు తన వాయిస్ తో ప్రేమలో పడతారు అని ఖచ్చితంగా చెప్పగలను.”అన్నారు

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ” ఇప్పటి వరకూ మీడియా వారికి ఆన్ సెట్స్ కు వచ్చి కవర్ చేయడం ఉండేది. మొదటిసారిగా ఓ అప్ కమింగ్ స్టార్ సినిమాకు లిరికల్ వీడియోకు సెట్ వేసి సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకు కారణం బేబీ సినిమా మొదటి పాటకు వచ్చిన రెస్పాన్సే. ఆ పాటకు చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది. బేబీ మూవీ మ్యూజిక్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఇక ఈ రెండో లిరికల్ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఈ పాట పాడిన ఇంటర్నేషనల్ లెవల్ లో క్రేజ్ ఉంది. తన ఫస్ట్ తెలుగు పాట మా సినిమాలోనిది కావడం విశేషం. ఈ పాట కోసం తను చాలా హార్డ్ వర్క్ చేసింది. భాషను అర్థం చేసుకుని పాడింది. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు ఓ హై మూమెంట్ వస్తుంది. దర్శకుడు చాలా ఎక్స్ పీరియన్స్ డ్ డైరెక్టర్ లా సాయి రాజేశ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆనంద్, వైష్ణవి, విరాజ్ లకు చాలా పేరు వస్తుందని నమ్ముతున్నాను. సోషల్ మీడియా నుంచి బేబీ చిత్రాన్ని సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను” అన్నారు.

ఇక బేబీ సినిమాలోని రెండో పాటను పాడిన ఆర్య దయాల్ మాట్లాడుతూ.. ” తెలుగు పాట కోసం ఇంత మంచి భాష నేర్చుకోవడం సంతోషంగా అనిపించింది. రికార్డింగ్ అంతా చాలా ఫన్నీగా జరిగింది. టీమ్ లోని ప్రతి ఒక్కరూ సహనంతో నాకు అన్నీ నేర్పించారు. నాలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు టీమ్ మొత్తం బాగా కృషి చేసింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ.. ” అంటూ ముగించారు.

కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ” మొదటి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. కానీ ఈ రెండో పాట అంతకు డబుల్ రేంజ్ లో ఉంటుంది. పాట చేస్తున్నప్పుడే నాకు అనిపించింది.. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని. ఇక ఈ పాట పాడేందుకు ఒప్పుకున్న ఆర్య దయాల్ గారికి థ్యాంక్యూ చెబుతున్నాను.. ” అన్నారు.

ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య,నాగబాబు, లిరీష తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్,
ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి,
పి.ఆర్.వోః ఏలూరు శీను, జిఎస్.కే మీడియా,
కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్,
రచన- దర్శకత్వంః సాయి రాజేశ్.

Sensational Singer Arya Dayal making Telugu debut with Baby’s second song.

The first song from Anand Deverakonda, Viraj Ashwin and Vaishnavi Chaitanya’s Baby, Oo Rendu Prema Meghalila was a raging chartbuster. The stage is set for the arrival of the second song now.

The second song is crooned by happening singer Arya Dayal. She is one of the trending music artists in the country now and the makers of Baby have pulled off a coup by bringing her on-board for the film. This will mark her Tollywood debut.

The director Sai Rajesh said “The first song is a sensational hit and we’re delighted to be unveiling the second song soon. It is crooned by Arya Dayal who has a huge follower base. I personally am a huge fan of her work. I am confident that the Telugu audience will fall in love with her voice.”

On the occasion, the producer, SKN says “For the first time ever, we erected a set for a lyrical video. The first song was a raging chartbuster and I assure you that the second song will be quite as good. We are confident that it’ll strike a chord with all sections of audience.

Arya Dayal said she feel honoured to be making her Tollywood debut with this winning audio single and thanked the makers for the opportunity.

Baby is gearing up for its theatrical release soon. The much anticipated second song from the album will be out soon.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest