మంచు బ్రదర్స్ ముష్టి యుద్ధం

 

  • సారథి ఇంటికి వెళ్లి గొడవపడ్డ విష్ణు
  • అన్నదమ్ముల మధ్య ఆస్తిగొడవలెనా?
  • ఇద్దరి వ్యవహారంపై మోహన్ బాబు సీరియస్

హైదరాబాద్:
మంచు ఫ్యామిలీ గొడవ రోడ్డెక్కింది. అన్నదమ్ముల మధ్య ముష్టి యుద్ధం జరిగింది. దీనంతటికి ఆస్తుల గొడవలే కారణమని ప్రరిశ్రమ కోడై కూస్తోంది. మంచు మనోజ్ కు మేనేజర్ గా పని చేస్తున్న సారథి ఇంటికి విష్ణు వెళ్లి గొడవ చేస్తున్న వీడియో ను మంచు మనోజ్ తన సోషల్ మీడియా లో పెట్టడంతో ఈ ముష్టి యుద్ధం మీడియాకు చిక్కింది. ఇంకేముందు మీడియా ఎవరికీ ఇష్టమొచ్చినట్టు వారు వాడుకున్నారు. దీంతో మంచు ఫ్యామిలీ ప్రతిష్ట కాస్త బజారున పడింది. ఈ వ్యవహారం అంత తెలుసుకున్న తండ్రి మంచు మోహన్ బాబు తన సుపుత్రులపై సీరియస్ అయ్యారు. వెంటనే వీడియోను తొలగించాలని మనోజ్ కు ఆదేశాలు ఇవవడంతో సోషల్ మీడియా నుంచి మనోజ్ వీడియోను తొలగించారు. మీడియాలో వస్తున్న కథనాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ మంచు ఫ్యామిలిలో ఎదో జరుగుతోంది అనే ప్రచారం మాత్రం గత కొద్దీ రోజులుగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ రెండో వివాహం భూమా మౌనిక జరగడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని, చివరికి మంచు లక్ష్మి చొరవ తీసుకుని ఆమె ఇంట్లోనే మనోజ్ మౌనిక ల వివాహం చేసిందని ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు. పెళ్లి సమయంలోనే విష్ణుకు ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి పెళ్ళికి వచ్చారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు సారథి వర్సెస్ విష్ణు గొడ్డువ వీడియొ బయటికి రావడంతో అన్నదమ్ములిద్దరి మధ్య ఆస్తుల గొడవలు జరుగుతున్నాయనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే మనోజ్ గొడవ వీడియోను తన సోషల్ మీడియాలో పెట్టకుండా ఉంటె మంచు కుటుంబం వివాదాన్ని మీడియా కూడా ప్రసారం చెయ్యడానికి భయపడేది. కానీ స్వయంగా మనోజ్ వీడియోను బయట పెట్టడంతో మీడియా మరింత రచ్చ రచ్చ చేసింది. మంచు ఫ్యామిలి గురించి తల తోక తెలియని కొన్ని మీడియా ఛానల్స్ నోటికొచ్చినట్టు వాగాయి. కొన్ని ఛానెల్స్ మంచు ఫ్యామిలిలో మహిళల మధ్య కూడా తగాదాలు జరుగుతున్నాయని ప్రసారం చేశాయి. సినిమాల గురించి తల తోక తెలియని కొందరు ఫిలిం జర్నలిస్టులుగా చెప్పుకుని నోటికొచ్చినట్టు టీవీలలో వాడుతున్నారు.
సద్దుమణిగిందా?
మంచు మోహన్ బాబు రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగిందని సమాచారం. అన్నదమ్ములిద్దరిని కూడా పిలిపించి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మరోసారి గొడవ పది ఇలా రోడ్డెక్కితే బాగోదని కూడా సీరియస్ మందలించినట్టు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest