స‌న్నీ హీరోగా నూత‌న చిత్రం ప్రారంభం

 

వినోద ప్ర‌ధాన‌మైన చిత్రాలు అందించాల‌న్న సంక‌ల్పంతో , అభిరుచితో టెక్సాస్ కు చెందిన ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ అనే నూత‌న సంస్థ చలనచిత్ర ప్రపంచంలో సరికొత్త సంచ‌ల‌నాలు సృష్టించడానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తొలి ప్ర‌య‌త్నంగా బిగ్ బాస్ ఫేమ్ , ఏటియ‌మ్ వెబ్ సిరీస్ తో న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.జె.స‌న్నీ హీరోగా ఓ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 9న గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించారు. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి మరియు రేఖ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
టాలెంటెడ్ రైట‌ర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొంద‌నుంది.
ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అధినేత‌లు మాట్లాడుతూ…“ వి.జె. సన్నీ హీరోగా ఈ రోజు మా చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించాం.  కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేయ‌డానికి ప్లాన్ చేశాం . ఎంతో ప్ర‌తిభావంతులైన న‌టీన‌టుల‌తో పాటు సాంకేతిక నిపుణులు మా చిత్రానికి ప‌ని చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, దర్శకులు మరియు నిర్మాతలను కనెక్ట్ చేసే టాలెంట్-స్కౌటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Hunt4Mint తో చేతులు కలపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు వారి ద్వారా మ‌రిన్ని మంచి చిత్రాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఎంతో అభిరుచితో ప్రారంభించిన మా సంస్థ నుండి మంచి చిత్రాలు చేయ‌నున్నాం. త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డిస్తాం“ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ః కార్తీక్ శ్రీనివాస్; సంగీతంః మదీన్; ఆర్ట్ డైరెక్టర్ః రాజీవ్ నాయర్; చీఫ్ కో-డైరెక్టర్ః చిన్న‌; కో -డైరెక్టర్ః సంతోష్ కృష్ణ; అసోసియేట్ డైరెక్టర్ః యశ్వంత్; అసిస్టెంట్ డైరెక్టర్ః యష్ ; పిఆర్ ఓః ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి- వంగాల కుమార‌స్వామి; నిర్మాణంః ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ; ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణః వి.జ‌య‌శంక‌ర్‌; ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వంః సంజ‌య్.

New movie with VJ Sunny as hero launched by Full Moon Media Productions

Full Moon Media Productions, a new film production banner, has been established with the purpose of bringing out entertaining films made with rich taste and strong conviction. The banner is ready to make pathbreaking movies in Telugu cinema. Its first movie was announced today.

Bigg Boss title winner VJ Sunny is its hero. The actor was recently seen in the web series ‘ATM’. The film has gone on the floors.

Sivannarayana, Sailaja Priya, Saptagiri and Rekha have got important roles in the movie.

Talented writer Sanjay is going to make his directorial debut. He has come up with an exciting story. Filmmaker V Jayashankarr, the acclaimed talent, is going to be the directorial supervisor.

Speaking about the project, Full Moon Media Productions said, “We are happy to launch the movie with VJ Sunny as the hero. From today, the regular schedule will go on at a stretch. The plan is to complete the shoot in a single schedule. Talented actors and highly competent technicians have been roped in. Hunt4Mint, a talent-scouting platform known for helping actors and directors from across the world network, has helped us a great deal. Through our collaboration with the platform, we are going to introduce many new talents to the film industry. And our endeavor will continue in the future. We have started the production house with a vision. More details about our first movie will be revealed soon.”

PROs: Lakshmi Ganapathy, Kumar Swamy
Cinematographer: Srinivas Reddy
Editor: Karthik Srinivas
Music Director: Madeen
Art Director: Rajeev Nayar
Chief Co-Director: Chinna
Co-Director: Santosh Krishna
Associate Director: Yashwant
Assistant Director: Yash
Production: Full Moon Media Productions
Directorial Supervisor: V Jayashankarr
Producer: Ravi Polishetty
Writer, director: Sanjay

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest