సాయి ధన్సికల ‘దక్షిణ’ చిత్రీకరణ పూర్తి 

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది.

చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”ఇదొక సైకో థ్రిల్లర్. సినిమా అంతా భావోద్వేగాలదే ప్రధాన పాత్ర. సాయి ధన్సిక ఐపీఎస్ అధికారి పాత్ర చేశారు. పవర్‌పుల్ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించారు. ‘దక్షిణ’ విడుదల తర్వాత ఆమెకు మరింత పేరు వస్తుంది. హైదరాబాద్, విశాఖపట్టణం, గోవాల్లో చిత్రీకరణ చేశాం. మొత్తం 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాల తరహాలో ‘దక్షిణ’ కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది” అని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest