సౌండ్ పార్టీ లో నా పాత్ర క్రికెట్ టీం లో ధోని లా ఉంటుంది

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు.  ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా  ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియా మిత్రులతో ముచ్చటించారు.

“సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో సినిమా.  అల్లంత దూరాన తర్వాత నటించిన చిత్రమిది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్  అవుతారని నమ్మకం ఉంది. ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. సిరి చాలా తెలివైన అమ్మాయి. నా పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. క్రికెట్ టీం లో ధోనీలా నా పాత్ర ఉంటుందని డైరెక్టర్ అంటుంటారు. సినిమా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను. లాస్ట్ లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర  ఉంటుందని.. అలా అంటారు. సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుంది. అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నే చాలా ఫన్నీగా దర్శకులు చూపించారు. ఇందులో బిట్ కాయిన్ గురించి కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిట్ కాయిన్ వాల్యూను చూపించారు. సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో  ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు. సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే  నేర్పించారు. ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే రెండు పాటలు మాత్రమే ఉంటాయి. మనీ మనీ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ ఉంటుంది.  డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.  ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. జయశంకర్ సార్ ప్రజెంటర్  గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక
ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం”.

శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి.

I am to ‘Sound Party’ what Dhoni was to Team India: Hrithika Srinivas

My character delivers a twist in ‘Sound Party’: Hrithika Srinivas

Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release on November 24. The entertainer stars budding heroine Hrithika Srinivas as the heroine. The upcoming actress, who is related to Amani as a niece in real life, will be seen in a bubbly role in this Full Moon Media Productions’ venture.

Produced by Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra, the comedy is presented by Jaya Shankar. “Ravi sir made his presence felt throughout the making stage. He selected me after watching a video clip. He used to call me and inquire me how I was doing. He would appreciate my performance,” Hrithika says.

In this interview, the young beauty talks about her character, director Sanjay Sheri’s work, her experience of teaming up with VJ Sunny, and more.

Excerpts from the interview:

I am tense ahead of the release of ‘Sound Party’. At the same time, I am excited. This November 24th, I am waiting for the audience to be entertained thoroughly! When I listened to the story, I sensed an element of curiosity in the subject. Moreover, this one balances entertainment and content.

I was brought up in Chennai and Bengaluru. I am currently a full-time actress. I am pursuing a Bachelor’s degree in English Literature. I wanted to become an actress even as a child. I was 16 when I decided to become an actress. As a child artist, I did a couple of movies in Tamil. Learning Bharatnatyam helped me understand the importance of the Navrasas. Acting became less hard thanks to my classical dance training. I also did Ads. When I watched a movie that I don’t want to name now, I felt that I could bring my own unique perspective to different roles. I want to live a lot of characters and that’s possible only with cinema.

In ‘Sound Party’, Siri is my name. She is smart and is integral to the story. She is like Dhoni in the film. And she gives a twist in the end. It’s like a sixer from Dhoni. The subject is serious but the treatment is comical! Siri has only a slight similarity with the real me.

The father-son duo (played by Sivannarayana and Sunny) are innocent but are greedy to make money. What they do to make easy money and what they face as a consequence is what ‘Sound Party’ is about. The element of Bitcoin is integral to the story.

Sunny is a huge TV star. You saw his real persona in Bigg Boss Telugu. He is always jovial and genuine. He is always open. Once he is on set, the whole set resonates with his energy. He is a nice co-star and would sometimes correct my pronunciation.

I enjoyed doing the film, both dialogue-wise and otherwise. I hope the audience, too, are going to enjoy watching the film. Director Sanjay Sheri is making a superb debut after writing so many movies. His comedy style is unique.

I am related to Amani aunty. I was not born when she left the film industry. That’s why I didn’t get to accompany her to film sets. But I got to be with her on TV sets. She has always supported my acting dreams and gives suggestions from time to time. When I told her I wanted to become an actress, she asked me to be prepared for hardships on my path given I am too young. She told me to be prepared for challenges.

I personally like Sai Pallavi and Nani sir a lot. They are natural performers.

Cast:

VJ Sunny, Hritika Srinivas, Sivannarayana, Ali, Saptagiri, ’30 Years’ Prudhviraj, ‘Mirchi’ Priya, Manik Reddy, Ashok Kumar, Kadambari Kiran, ‘Gemini’ Suresh, Bhuvan Saluri, ‘I Dream’ Anjali, Vasu Inturi, Chalaki Chanti, Prem Sagar, RJ Hemanth, Shashank Mouli, Trinadh, Krishna Teja and others.

Crew:

Director of Photography: Srinivas Reddy; Editor: G Avinash; Music Director: Mohit Rahmaniac; Lyricist: Poornachari; Production Designer: Rajeev Nair; Co-Writers: Patel Nandurka, Sundar Palutla; PRO: GK Media; Chief Co-Director: Chinna; Co-Director: B Santosh Krishna; Associate Directors: Yashwanth Valaboju, Krishna Chaitanya T; Assistant Directors: /Yash, Dilip Kumar Raju, Yuvan Phanindra S: Line Producer: Sivakanth Vanga; Executive Producer: Bhuvan Saluru; Producers: Ravi Polishetty, Mahendra Gajendra, Sri Shyam Gajendra; Presented by: V Jayashankar; Written and Directed by Sanjay Sheri.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest