దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరక్కిన్న సినిమా బలగం. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, దిల్ రాజు అన్న కొడుకు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 3వ తేదీన విడుదలైన బలగం సినిమా సూపర్ సక్సెస్ అయింది. కమర్షియల్ గా గూడా మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లి సౌత్ ఓ టి టి ల్లో విడుదల కానుంది. ఇందులో చాలా మంది కొత్త నటీనటులు నటించారు.ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు.
Post Views: 38