CRICKET-2023 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా -కప్ అందించిన మోడీ

 

అహ్మదాబాద్ (గుజరాత్ ,19 నవంబర్ 2023 )
ప్రపంచ క్రికెట్ కప్ -2023 చాలా మంది ఊహించినట్టే జరిగింది. వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ గా ఆస్ట్రేలియా టీమ్ నిలిచింది. హెడ్ ఒక్కడే 58 ఎనిమిది బంతుల్లో 137 పరుగులు తీసి ఆస్ట్రేలియాను విజయతీరానికి చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హెడ్ అందుకున్నాడు. భారత సొంత గడ్డపై టీమ్ ఇండియాను కంగారులు కంగారు పెట్టేశారు. కంగారులు వేసిన బౌలింగ్ ధాటికి టీమ్ ఇండియా ఎదుర్కోలేక చతికిల పడ్డారు. 240 పరుగులకే రోహిత్ శర్మ సేనను ఆల్ ఔట్ చేశారు. అహ్మదాబాద్ లోని నరేద్ర మోడీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సేనను కంగారులు కన్నీళ్లు పెట్టించారు. కోట్లాదిమంది ప్రజల భారతీయుల ఆశలపై నీళ్లు చల్లారు. మరో నలభై బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ పూర్తి చేశారు. టీమ్ ఇండియాను మట్టికరిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రపంచ కప్ ను అందుకున్నారు. ప్రపంచ కప్ 2023 ఛాంపియన్ గా ఆస్ట్రేలియ టీమ్ నిలిచింది. కేవలం నాలుగు వికెట్లు మాత్రం ఈ మ్యాచ్ లో ఇండియా బౌలర్లు తీయ్యగలిగారు. మొదట మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియాను హెడ్ ఆదుకున్నాడు. విన్నింగ్ షాట్ కొట్టబోయిన హెడ్ చివర్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. సరిగ్గా ఇరవై ఏళ్ళ తరువాత ఇండియా -ఆస్ట్రేలియా ఫైనల్ లో తలపడ్డాయి. అయినా కూడా ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా కప్ తీసుకుని వెళ్ళిపోయింది. ప్రపంచ కప్ విజేతగా నిలవడం ఆస్ట్రేలియాకు ఇది ఆరోసారి. ప్రపంచ కప్ ప్రధాన చేసిన మోడీ ఆస్ట్రేలియా ప్రతిభను అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest