గాంధీ ఆసుపత్రికి ప్రీతి మృతదేహం- నిమ్స్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి

 

  • నిమ్స్ ఆస్పత్రి వద్ద పోలీసుల మోహరింపు
  • ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్న అధికారులు
  • మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ సిద్ధం చేసిన అధికారులు
  • అంబులెన్స్ ముందు బైఠాయించిన ప్రీతి బంధువులు, గిరిజనులు.
  • ప్రీతి మృతదేహాన్ని ప్రగతి భవన్‌కు తీసుకెళ్తామంటున్న బంధువులు.
  • నిమ్స్‌ ఆస్పత్రి గిరిజన సంఘాలు, బీజేపీ కార్యకర్తల ఆందోళన
  • ఆందోళనకు దిగిన బంధువులు

హైదరాబాద్

సీనియర్ వేధింపులు తాళలేక హానికర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడి గత నాలుగు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. నిమ్స్​లో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి ప్రాణాలు విడిచింది. ఎలాగైనా దేవుడి దయతో బ్రతికి వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు కన్నీటి శోకమే మిగిలింది.ప్రీతి మరణంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రీతి మరణంపై మంత్రి హరీశ్​రావు స్పందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest