ఢిల్లీ ఓయో హోటల్ సెక్స్ రాకెట్ -7గురు మహిళలు, 4గురు పురుషుల అరెస్ట్

న్యూ ఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీ , నోయిడా లో ఓ సెక్స్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సెక్స్ రాకెట్ ను ఓయో హోటల్ లో పట్టుకున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఓయో హోటల్ లో సెక్స్ రాకెట్ దందా నడుస్తున్నట్టు పోలీసులు పక్క సమాచారం అందుకున్నారు. సెక్టార్ 41 లో ఉన్న ఓయో హోటల్ లో సెక్స్ రాకెట్ దందా నడుస్తున్నట్టు కనుగొన్న పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest