హైదరాబాద్ , ఫిబ్రవరి 27 : జనగామ జిల్లా గిర్నీ తండాకు చెందిన మెడికో స్టూడెంట్ ప్రీతీని హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రీతీ మరణ వార్త తో గిర్నీ తాండ విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో గత నాలుగైదు రోజులుగా చికిత్స పొందుతో ఆదివారం చనిపోయిన ప్రీతీ అంత్యక్రియలు ఆమె స్వగ్రామైన గిర్నీ తండాలో జరిగాయి. పెద్ద ఎత్తున గిర్నీ తండా కు స్థానిక ప్రజలు తరలి వచ్చారు. కొరోనా సమయంలో కూడా ప్రతి ఒక్కరికి ఆమె వైద్యం చేసిందని గ్రామా ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. ప్రీతీ ఆపరేషన్ థియేటర్ లో ఆత్మహత్య చేసుకోలేదని, నలుగురు అయిదుగురు కలిసి ఎదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రీతీ మృతి పై సమగ్ర విచారణ జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 34