ఉత్తరప్రదేశ్
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడిని UP పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో రైనా అత్తామామ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు రషీద్.. అడ్డుకోబోయిన వారిద్దరితోపాటు రైనా బావమరిదిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో రైనా అత్తామామ మృతి చెందారు. అప్పటినుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిపై రూ.50వేల రికార్డ్ ప్రకటించారు. ఇవాళ ముజఫర్ నగర్లో రషీద న్ను ఎన్ కౌంటర్ చేశారు.