- డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళుతుంటే అడ్డుకున్నావ్
- ఇప్పుడు హాత్ సే హాత్ జూడో యాత్రలో దాడి చేశావు
- బహిరంగ క్షమాపణ చెప్పు లేదంటే తగిన మూల్యం చెల్లిస్తావ్
- నేతకాని మహర్ , సమతా సైనిక దళ్ సంఘాల నాయకుల డిమాండ్
ఎన్టిపిసి, ఫిబ్రవరి 26:
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గోమాసే జోలికి వస్తే ఊరుకునేది లేదని నేతకాని మహర్, సమతా సైనిక దళ్ సంఘాల నాయకులు హెచ్చరించారు ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి ఎఫ్సీఐ కూడలిలో సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశానికి ముఖ్య అతిథులుగా నేతకాని మహర్ సంఘాల జాతీయ నాయకులు బండారి కనకయ్య , దుర్గం నరసయ్య ,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న , సమతా సైనిక దళ్ నాయకులు దూట రాజు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గోమాసే శ్రీనివాస్ పై అదే పార్టీకి చెందిన ప్రేమ సాగర్ రావు మనుషులు దాడి చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. గోమాస శ్రీనివాస్ నేతకాని దళిత జాతిలో పుట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేయడంతో గోమాసే కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడానికి ఓర్చుకోలేక ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచరులు భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు. గతంలో కూడా గోమాసే శ్రీనివాస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గా పదవి పొందిన వెంటనే అంబేద్కర్ దయతో ఈ అవకాశం దక్కిందని అందుకు కృతజ్ఞతగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడానికి వస్తున్న క్రమంలో కూడా అడ్డుకున్నారని తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో బెల్లంపల్లిలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న గోమాసే శ్రీనివాస్ పై ప్రేమ్ సాగర్ రావు అనుచరులు దాడి చేయడం పై తీవ్రంగా ఖండించారు. టిపిసిసి అధిష్టానం ప్రేమ్ సాగర్ రావు ను వెంటనే పార్టీ నుండి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.అగ్రకుల అహంకారంతో మతోన్మాదంతో కొంతమంది రౌడీ మూకలను రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్న నిన్ను వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు అందరం కలిసి రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరించారు.