- ముగ్గురు నిందితులు, 1. 1/2 కేజీల గంజాయి స్వాధీనం
- చట్టవ్యతికేంగా అసాంఘీక తమ పనులకు పాల్పడితే చర్యలు తప్పదని హెచ్చరించిన సిఐ
మంగళగిరి
మంగళగిరి మండలం పెదవడ్లపూడి హిందుస్మశాన వాటికాలో గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి సిఐ మారయ్య బాబు ఆధ్వర్యంలోని బృందం. రాబడిన సమాచారం మేరకు నిఘా ఏర్పాటు వలపన్ని ముగ్గురూ యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1.1/2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని గ్రామంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు పెదవడ్లపూడి, భగత్ సింగ్ నగర్, బాప్టీస్ట్ పేటలకు చెందిన వారు దిలీప్ వెంకట నాగార్జున పెదవడ్లపూడి, వై గణేష్ భగత్ సింగ్ నగర్, బి రవీ మంగళగిరి బాప్టీస్ట్ పేటకు చెందిన వారు. ఈ దాడులలో సిఐ మారయ్య బాబు, ఎస్సై మల్లిఖార్జున్, హెడ్ కానిస్టేబుల్ పద్మజా, పిసిలు ఎ శ్రీనివాసరావు, రమేష్, హనుమంతు, రజని తదితరులు పాల్గొన్నారు. ఆ సాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈబి సిఐ మారయ్య బాబు హెచ్చరించారు.