ఘనంగా సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్

55వ డివిజన్ లోని భీమారం అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ 55వ డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా విచ్చేసి కేకు కట్ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే,వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అరూరి రమేష్ .ఈరోజు 55వ డివిజనలోని భీమారం శివాలయంలో కార్పొరేటర్ జక్కుల రజిత వేంకటేశ్వర్ల మరియు డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ .  ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.తదనంతరం భీమారం సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ 55వ డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ ఆధ్వర్యంలో
సీఎం కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలలో 69 కిలోల కేకుతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిదిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్  మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధకులు, బంగారు తెలంగాణ నిర్మాత, నాలుగున్నర కోట్ల ప్రజల జీవ నాడి, ప్రజా సంకల్ప నాయకులు గౌరవ తెలంగాణ ఉద్యమ రథ సారథులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, కార్యదీక్ష పరుడు, మేదోశక్తితో బంగారు తెలంగాణకు బాటలు వేసిన తెలంగాణ జాతిపిత.. కాలేశ్వరం జలాలతో బీడు భూముల్లో సిరులు కురిపించిన అపభగీరథుడు, సంక్షేమ పథకాల సృష్టికర్త, అలు పెరగని వీరుడు… దేశానికి జాగృతి చేసి జాతి భవితను మార్చంగ.. నడుము కట్టిన ధీరుడా.. భావి భారత సూర్యుడా.. తెలంగాణ విధాత భావి భారత నిర్మాత భారత రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కార్పొరేటర్ శిరంగి సునీల్ కుమార్,రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీ బాబు, ఎర్రగట్టుగుట్ట చైర్మన్ చింతల లక్ష్మణ్, డైరెక్టర్లు కంచర్ల త్యాగరాజు, దేశిని భరత్, డివిజన్ ఉపాధ్యక్షులు రాయికంటి సుధాకర్, సంగాల చిన్న, డివిజన్ యూత్ అధ్యక్షుడు గుంజే సాయి కుమార్, మహిళా అధ్యక్షురాలు గడ్డం భాగ్యలక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షులు రాయికంటి సురేష్,గ్రామ కార్యదర్శి నాతి సమ్మయ్య,గ్రామ యూత్ అధ్యక్షులు బేతేల్లి వినయ్, గ్రామ మహిళా అధ్యక్షురాలు సంగాల సరోజన, బి ఆర్ ఎస్ 55వ డివిజన్ ఎస్ సీ సెల్ అధ్యక్షులు నమ్మిండ్ల రవీందర్,సోషల్ మీడియా డివిజన్ అధ్యక్షులు గడ్డం భగత్, సోషల్ మీడియా గ్రామ అధ్యక్షులు జక్కుల రాహుల్,గ్రామ ఎస్ సీ సెల్ అధ్యక్షులు సంగాల శంకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేశిని వీరన్న, పోగుల రమేష్, గజాల గోవర్ధన్, బూర రాంరాజ్, బూర శ్రీధర్,తోట రమేష్,ఉప్పు ప్రభాకర్,ఉప్పు రమేష్,ఉప్పు భాస్కర్,మెరుగోతు రఘు,దేవర సమ్మయ్య,జిల్లా యూత్ నాయకులు నమ్మిండ్ల అరుణ్, జక్కుల శంతన్,సంగాల డేవిడ్,భార్గవ్,పల్లపు రవికుమార్,వెలిసోజు అభిషేక్, రాజేష్, శివ, ఫెరోజ్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest