చంద్రబోసు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం

చల్లగరిగె
ఆస్కార్ అవార్డు పొందిన తెలంగాణా బిడ్డ, సినీ గేయ రచయిత చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడమైనది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ఈ నెల 2న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల మైదానంలో జరుప తలపెట్టాము. ముందుగా చంద్రబోసు ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద ఆశీర్వచనం ఉంటుంది…ఆ తర్వాత అక్కడి నుంచి పాఠశాల మైదానం వరకు భారీ ర్యాలీగా చేరుకుంటారు.. వేదికపై గ్రామస్తులు, బాల్యమిత్రులు, అభిమాన సంఘాల వారు సత్కరిస్తారు.. ఆ తర్వాత చంద్రబోసు ప్రసంగిస్తారు..ఈ కార్యక్రమం గ్రామస్తులు, బాల్యమిత్రుల ఆధ్వర్యంలో జరుగుతుంది.. చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ప్రజలు, చంద్రబోసు అభిమానులు తరలివస్తున్నారు.. కావున ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించగలరని మనవి..

ఇట్లు
చల్లగరిగె గ్రామస్తులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest