నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎర్రబెల్లి

  • నేడు రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో సీఎం కెసిఆర్ పర్యటన
  • ఆయా గ్రామాల్లో పర్యటించి, పంట నష్టాలను, హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పెద్ద వంగర (మహబూబాబాద్) మార్చి 23:
ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (రేపు) గురువారం పర్యటించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను  రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. సీఎం కెసీఆర్ పర్యటించనున్న మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు డివిజన్ పెద్ద వంగర మండలం లోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను మంత్రి మరోసారి పరిశీలించారు. అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలాలను, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

పంట నష్టపోయిన రైతు పూర్తి వివరాలు, రైతుబంధు, రైతు బీమా, విస్తీర్ణం, రైతు అందుబాటులో ఉండేట్లు చూడాలని పర్యటనలో ఎలాంటి అంతరాయాలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తగు సూచన సలహాలు చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక్, ఎస్పీ శరత్ చంద్ర నాయక్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, డి ఏ ఓ చత్రు నాయక్, డి హెచ్ ఎస్ ఓ సూర్యనారాయణ, ఆర్ & బి తానేశ్వర్, ఆర్ డి ఓ ఎల్ రమేష్, ఎంపీపీ రాజేశ్వరి, పిఎసిఎస్ చైర్మన్ హరిప్రసాద్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest