అందోల్
రాష్ట్రంలో పేపర్ ల లీకేజీ ల వెనక బి జె పి నాయకుల హస్తం ఉందని అందో ల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. దేశం లోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బి జే పీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీ లు అనే అనుమానాలు బలపడుతున్నాయి అని ఆయన అన్నారు. టి ఎస్ పి ఎస్సీ పేపర్ లీకేజీ లో వున్న వ్యక్తి కి బి జె పి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గతంలో అనేక ఫోటోలు బయటకు వచ్చాయి తాజాగా పదవ తరగతి పేపర్ లీక్ చేసిన వ్యక్తి బి జె పి అధ్యక్షుడు బండి సంజయ్ కు whatsup చేసినట్టు ఆరోపణలు రావడం whatsup చేసిన తర్వాత ఆ విషయాన్ని బండి సంజయ్ దాచడం ఇందుకు బలాన్ని చేకూర్చతుంది అని ఆయన అన్నారు. ఈ పేపర్ ల లీకేజీ ముమ్మాటికీ బి జె పి కుట్ర నే అని ఆయన అన్నారు. కేంద్రం లోని నరేంద్రమోడీ బి జే పీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక పోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ లో నిరుద్యోగుల జీవితాలతో బి జె పి నాయకులు ఆటలు ఆడుకుంటున్నారు ఆయన ఆరోపించారు. రఅధికార దాహంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయన్ విలువలు లేకుండా ప్రవర్తిస్తూ నీచానికి దిగజారిన బండి సంజయ్ ను ప్రాసిక్యూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.