బీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడిన మురళీ గౌడ్ కు బండి పరామర్శ

తాండూరు

బీఆర్ఎస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బిజెపి నాయకులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ గౌడ్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. తాండూరులోని వారి నివాసానికి వెళ్లిన  బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ గూండాల దాడిని, పోలీసులు వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారి ఆవేదనను చూసి చలించిపోయారు.పోలీసుల సమక్షంలోనే  మురళీ గౌడ్ నివాసంపై దాడులు జరిపి, పసిపిల్లలని చూడకుండా కుటుంబ సభ్యులను చంపే యత్నం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే డీజీపీ స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని  బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest