బైరి నరేష్ పై దుండగుల దాడి -అయ్యప్ప భక్తుల పేరుతో అమానుషం

హనుమకొండ , ఫిబ్రవరి 27 :
హనుమకొండ జిల్లాలో బైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. సినిమా ఫక్కీలో దాడి చేశారు. పొలిసు వాహనంలో ఉన్న నరేష్ ను అడ్డుకుని మరి పొలిసు హవనం లోపలి వెళ్లి నరేష్ పై దాడి చేశారు. సుమారు పది మంది వరకు ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బట్టి స్పష్టమవుతోంది. ఒకపక్క పోలీసులు ఆపుతునే ఉన్న కొందరు పొలిసు వ్యాను లోపలికి వెళ్లి బైరి నరేష్ ను కొట్టారు. గతంలో అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ జైలుకు వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చారు. హనుమకొండ లోని ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. హనుమకొండ లోని గోపాలపురం లో నరేష్ పై దాడి జరిగింది. అయ్యప్ప భక్తుల పేరుతో తనపై కొందరు దుండగులు దాడి చేశారని టివి9 కు తో మాట్లాడుతో నరేష్ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest